‘మా’ ఎన్నికల్లో ఓటేయని హీరో హీరోయిన్లు వీరే

‘మా’ ఎన్నికల్లో ఓటేయని హీరో హీరోయిన్లు వీరే

హైదరాబాద్: హోరాహోరీగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పలువురు అగ్ర హీరోలు, హీరోయిన్లు ఓట్లు వేయలేదు. సాధారణ ఎన్నికలను మరిపించేలా మాటల యుద్ధంలా సాగిన ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా భారీగా పోలింగ్ జరిగింది. ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న నటులు ప్రత్యేకంగా ఓట్లేయడం కోసం విమానాల్లో హైదరాబాద్ వచ్చి ఓటేసి వెళ్లిపోగా కొందరు అగ్రనటులు, నటీమణులు హైదరాబాద్ లోనే ఉంటున్నా ఓటింగ్ కు మొహం చాటేశారు. 
సీనియర్ నటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, బ్రహ్మానందం, బాబు మోహన్, చలపతిరావు, గిరిబాబు, సీనియర్ నటీమణులు జయప్రద, రోజా తదితరులు ఉత్సాహంగా వచ్చి ఓట్లేశారు. అయితే డార్లింగ్ ప్రభాస్, మహేష్ బాబు, రవితేజ, విక్టరీ వెంకటేష్, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, రానా, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, అనుష్క, త్రిష, హన్సిక, ఇలియానా, నిహారిక, అల్లు అర్జున్, శర్వానంద్, సునీల్, సుమంత్, సుశాంత్, సత్యదేవ్ తదితరులు ఓట్లు వేయలేదు. ఇతర రాష్ట్రాల్లో, షూటింగులో ఉండిపోయినందున పలువురు ఓట్లేయలేకపోగా.. మరికొందరు ఆసక్తి లేక.. వర్గాలకు అతీతంగా ఉండేందుకు ఓటింగ్ కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది